నిద్ర లేవగానే ముందుగా టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. టీ తాగిన తరువాత కాసేపటికి టిఫిన్ చేస్తుంటారు. ఇలా నిద్రలేవగానే టీ తాగడం వలన ప్రమాదాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇలా నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన కడుపులోని ఆమ్లా, ఆల్కలీవ్ పదార్ధాలు సమతుల్యత కొరవడుతుందట. దీని వలన శరీరం నుంచి నీటిని తొలగించి డీహైడ్రేట్ చేస్తుందని చెబుతున్నారు.

దీనితో పాటు ఇలా ఉదయాన్నే టీ తాగడం వలన దంతాలపై ఎనామెల్ దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇక పాలలో లాక్టోస్ పదార్ధం వలన కడుపులోని ఖాళీ పేగులపై ప్రభావితం చేసి కడుపు ఉబ్బరాన్ని దారి తీస్తుందని చెబుతున్నారు. అందువలన ఉదయాన్నే టీ తాగకుండా ఏదైనా తిన్న తరువాత టీ తాగితే ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ఉంటాయని చెబుతున్నారు.