మెగా స్టార్ కుటుంబం నుంచి దాదాపుగా 10 మంది వరకు హీరోలు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఒకే ఒక్క అమ్మాయి ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మెగా ప్రిన్స్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఇంత వరకు నిహారిక కొణిదలకు సరైన హిట్ రాలేదు. రీసెంట్ గా చేసిన “సూర్యకాంతం” సినిమా కూడా బీలో యావరేజ్ గా నిలవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా పూర్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఇప్పటికే తన పెదనాన్న చిరంజీవి “సైరా” సినిమాలో క్యామియో రోల్ చేస్తున్న నిహారిక కొణిదెల ఇప్పుడు తన బావ మెగా హీరో అల్లు అర్జున్ సినిమాలో ఒక కీలక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో నిహారిక ఒక కీలక రోల్ చేయనున్నదట. దీనికి సంబంధించి ఇప్పటికే ఫైనల్ డిస్కషన్ ముగిశాయట. ఈ మధ్య కాలంలో తనకు హిట్ రావడం లేదని తాను ఇంకా సినిమాలకు స్వస్తి చెప్పి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పై తన హావ కొనసాగిస్తానని చెప్పిందని వినికిడి. ఇక హీరోయిన్ గా అంత సక్సెస్ రేట్ లేకపోవడంతో క్యామియో రోల్స్ తో మెప్పించి, తరువాత మరోసారి హీరోయిన్ గా ట్రై చేస్తుందేమో చూడాలి. కానీ మెగా హీరోతో…మెగా మరదలు సినిమా అంటే కొంత ఇంట్రెస్టింగ్ మ్యాటరే. ప్రస్తుతానికి అల్లు అర్జున్ … త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో రానున్న సినిమాను చేయనున్నాడు. సుకుమార్ సినిమా కూడా ఈ శ్రావణ మాసంలో మంచి రోజు చూసుకొని ముహూర్తం షాట్ కొట్టి, వచ్చే నెలలో సినిమా ప్రారంభించాలని బావిస్తున్నారట.

  •  
  •  
  •  
  •  
  •  
  •