పేరుకే బయటకు స్వామిజి అవతారం… లోపల చేసేవాణ్ణి భోగం పనులు… నిత్యానంద అనే ఒక బడుద్ధాయ్ చేసే పనులు వలన అతడిని గతంలో అరెస్ట్ చేస్తే తప్పించుకోవడానికి నాకు అసలు మగతనమే లేదని చెప్పిన ప్రబుద్ధుడిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కొత్తగా గుజరాత్ కు చెందిన జనార్దన్ శర్మ దంపతులు తమ ఇద్దరి కూతుర్లను నిత్యానంద తన ఆశ్రమంలో బంధించాడని వారిని విడిపించాలని పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు విచారణ చేపట్టి అయ్యవారి ఆశ్రమానికి వెళ్ళారు.

ఇక అక్కడ నిత్యానంద ఫ్లాట్ లో ఉన్న మరొక ఇద్దరు మైనర్ బాలికలను పోలీసులు కాపాడి వారిని బయటకు తీసుకొని వచ్చారు. జనార్దన్ శర్మ దంపతుల కూతుర్లు మాత్రం తాము ఇక్కడ నుంచి తమ తల్లితండ్రులతో వెళ్లడం ఇష్టం లేదని చెప్పడంతో పోలీసులతో పాటు, జనార్ధన శర్మ దంపతులు షాక్ కు గురయ్యారు. వారి ఇద్దరి కుమార్తెలు రావడానికి నిరాకరించడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు.

నిత్యానంద ఫ్లాట్ లో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారని ఇద్దరు మహిళ శిష్యురాలను పోలీసులు అరెస్ట్ చేసారు. గుజరాత్ పోలీసులు ఇంతటితో ఆగకుండా బెంగళూర్ శివారులోని బిడిది ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న అందరిని విచారించడానికి సిద్ధమయ్యారు. నిత్యానందతో పాటు అతడి శిష్యుల మీద అనేక ఆరోపణలు రావడంతో అతడి పని పెట్టే యోచనలో గుజరాత్ పోలీసులు నిమగ్నమయ్యారు. అసలు తాను సంసారానికి పనికిరానని చెప్పిన నిత్యానంద ఎప్పుడు మహిళా శిష్యులను వెంటపెట్టుకొని తిరుగుతూ నిజంగా సంసారానికి కాదు ఈ సమాజానికే పనికిరాని వాడిగా తయారవుతున్నాడు.