ఏపీకి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి 3805 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్ధిక మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు నిర్మలా సీతారామన్ రాజ్యసభలో పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ బకాయలను వెంటనే విడుదల చేయాలనీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి జీరో అవర్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈవిధంగా స్పందించారు. అలాగే కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కుంటున్న ఆర్ధిక ఇబ్బందులపై సీఎం జగన్ ప్రధానికి లేఖ రాసారని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. త్వరలోనే ఈ మొత్తం బకాయిల చెల్లింపు పక్రియ పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

చిరంజీవి గుండు వెనకున్న అసలు రహస్యం బయటపడింది..!

నేను చనిపోయాననుకున్నారు.. బిగ్ బాస్ కంటెస్టెంట్..!