యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటించిన తాజా సినిమా ‘బీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల అయ్యింది. విడుదలైన మొదటి ఆట నుండే హిట్ టాక్ సాధించిన ‘బీష్మ’ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. దీంతో వారంకాక ముందే బీష్మ బ్రేక్ ఈవెన్ సాధించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

కాగా ఫిబ్రవరి 29న శనివారం వైజాగ్ లో ‘బీష్మ’ చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించనుంది. కాగా ఈ ఈవెంట్ కు మెగా హీరో వరుణ్ తేజ్ అతిధిగా వస్తున్నాడు. వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో ఈ వేడుక నిర్వహించనున్నారు. ఇక దీంతో మెగా అభిమానులకు, నితిన్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

  •  
  •  
  •  
  •  
  •  
  •