బాలీవుడ్ లో విజయవంతమైన ‘అంధాదున్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక నభా నటేష్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక హిందీలో టబు నటించిన పాత్రలో తెలుగు వెర్షన్ లో తమన్నాను తీసుకున్నారు. ఈ సినిమాలో ఈ పాత్ర చాలా కీలకం కానుంది. ఈ పాత్రకు చాలా మంది పేర్లు వినిపించినప్పటికి చివరకు తమన్నాను తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉందని చిత్ర బృందం తెలియచేసింది.
ప్రస్తుతం ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక నితిన్ ఈ మూవీతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘రంగ్ దే’, కృష్ణ చైతన్యతో ‘పవర్ పేట’ సినిమాలను కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ సినిమాల షూటింగ్ వాయిదా పడింది.
కరోనా దెబ్బతో స్టేడియంలోకి మీడియాకు నో ఎంట్రీ
కంగనాకు చుక్కలు చూపించిన జర్నలిస్ట్
బిగ్ బాస్ లో ఎంట్రీ కోసం అతడు 10 లక్షలు ఖర్చు చేశాడట