యువ హీరో నితిన్ నటిస్తున్న సినిమాకు ఆసక్తికర టైటిల్ ను పెట్టారు. వైవిధ్య చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘చెక్’ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీలుక్ ను దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. టైటిల్ సోస్టర్‌ను చూస్తుంటే చేతికి సంకేళ్లు, చెస్‌లోని కాయిన్స్‌తోపాటు ఇనుప కంచె కన్పిస్తోంది. దీంతో డిఫరెంట్‌ జోనర్‌లో సాగే థ్రిల్లర్‌ మూవీగా, ఇప్పటి వరకు నితిన్‌ నటించిన అన్ని సినిమాల కంటే కాస్తా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. చదరంగ నేపథ్యంలో సాగే ఓ ఉరి శిక్షపడ్డ ఖైదీ కథ ఈ సినిమా అని తెలుస్తుంది. ఈ నెల 12 నుండి ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.