నిత్య మీనన్ గురించి మాట్లాడాలంటే ఆమె చేసే సినిమాలే సమాధానం చెబుతాయి. కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్న సమయంలో కూడా జాగ్రత్తగా తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేసుకుంటూ కెరీర్ లో గుర్తుండిపోయేలా సినిమా చేసి అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు యువ హీరో నితిన్ కు హిట్స్ రాక ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో అతడితో కలసి నిత్య మీనన్ నటించడంతో నితిన్ కెరీర్ గాడిన పడింది. ఆ తరువాత వారిద్దరూ కలసి “గుండెజారి గల్లంతైంది” అనే సినిమా కూడా చేసి మంచి హిట్ సాధించారు. గతేడాది నిత్యామీనన్ “మిషన్ మంగళ్” సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే

కానీ నిత్యామీనన్ మొదటి నుంచి కాస్త బొద్దుగానే ఉంటుంది. కానీ ప్రేక్షకులు ఆమెలో నటన మాత్రమే చూసారు తప్ప, బొద్దుగా ఉందా సన్నగా ఉందా అన్న విషయాన్ని పట్టించుకోలేదు. రీసెంట్ గా నిత్యామీనన్ తన బరువు గురించి మాట్లాడుతూ కొంతమందికి బాడీ షేమింగ్ చేయడం అలవాటుగా మారిందని, మనకన్నా బొద్దుగా ఉన్నవారు మనల్ని కామెంట్ చేయరని, ఎవరైతే సన్నగా ఉన్నారో వారు కామెంట్స్ చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకొచ్చింది.

తన బరువుపై ఇండస్ట్రీలో కొందరు చేసే కామెంట్స్ పట్టించుకొనని, తన బరువు చూస్తున్నారా లేక తన నటన చూస్తున్నారా అన్నది వారే నిర్ణయించుకోవాలని అన్నారు. మనం ఏమిటో మన సినిమాలే చెబుతాయని, అసలు ఇలా కామెంట్స్ చేసేవారి కోసం పోరాటం చేయవల్సిన అవసరం లేదని, అసలు బరువు ఎందుకు పెరుగుతుందని, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఇలా అనేక ప్రశ్నలు మనల్ని చుట్టుముడతాయని, కానీ వాటిని పట్టించుకుందా ముందుకు వెళితేనే కెరీర్ సాఫీగా నడుస్తుందని చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాది నిత్యామీనన్ దర్శకురాలిగా అవతారమెత్తడానికి లాక్ డౌన్ సమయాన్ని ఉపయోగించుకొని కథలు సిద్ధం చేసుకుంటుందట.

మహేష్ బాబు దూకుడుకి సాటెవ్వరు.!

కరోనా వైరస్ వలన యువతలో వీర్య కణాల వృద్ధి తగ్గిపోతుందట