రేపటితో మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన గడువు ముగియడంతో ఏ క్షణమైనా రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉండటంతో ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ తో పాటు మరికొందరు పెద్దలు మహారాష్ట్రపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి నితిన్ గడ్కరీ మహారాష్ట్ర కొత్త సీఎం అభ్యర్థిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

కానీ దీనిపై నితిన్ గడ్కరీ మట్లాడుతూ తనకు మహారాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టాలన్న ఆలోచన లేదని తనకు ఢిల్లీనే బాగుందని, తాను కేంద్ర మంత్రిగానే ఉంటానని ఆ బాధ్యతలు తనకు సరిపోతాయని చెప్పుకొచ్చారు. మరోవైపున దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉండటానికి శివసేన ఒప్పుకోకపోవడంతో తమకు రెండునర్ర సంవత్సరాలు సీఎం పదవి కావాలని అడగడంతో ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన భగవత్ శివసేన అధ్యక్షుడితో ఫోన్ లో మంతనాలు చేసారు. నితిన్ గడ్కరీ మాత్రం బీజేపీ అభ్యర్ధే సీఎంగా బాధ్యతలు తీసుకుంటారని, తనకు అయితే ఇష్టం లేదని ఖరాకండిగా చెప్పేసారు.