టాలీవుడ్ లో అనేకమంది హీరోలు వారికి తగట్లు ప్రవర్తిస్తూ వారి పరపతికి తగట్లు ప్రవర్తిస్తూ మరొక హీరోను పొగడటానికి ఏమాత్రం ముందుకురారు. కానీ సినిమాలలోకి రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్న యంగ్ హీరో నితిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒకపేరు వచ్చినా పవన్ కళ్యాణ్ పేరు తలవని రోజు ఉండదు. పవన్ కళ్యాణ్ తన దేవుడని తాను ఒక భక్తుడినని అతడి కోసం ఏదైనా చేయాడానికి తాను సిద్దమనే రీతిలో మాట్లాడుతుంటాడు. అలాంటి నితిన్ కు చిరకాలంగా పవన్ కళ్యాణ్ తో కలసి పనిచేయాలని కోరిక బలంగా ఉంది.

ఇప్పుడు ఆ కోరిక తీరే సమయం ఆసన్నమైంది. పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పటికే మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు. వాటిలో మలయాళంలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్ కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో ఇద్దరు హీరోలు పాత్రలు ఉండటంతో ఒక పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తుండగా రెండవ పాత్ర కోసం దగ్గుపాటి రానాను సంప్రదించడం జరిగింది. అతడు ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు అనేలా ఉండటంతో ఇప్పుడు ఈ పాత్రను యంగ్ హీరో నితిన్ తో చేయిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట.

హీరో నితిన్ తో పవన్ కళ్యాణ్ కు ఉన్న సాన్నిహిత్యం కూడా ఈ పాత్ర నితిన్ దగ్గరకు వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ లో చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు మాటలను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిని అడుగుతున్నారట. కానీ కథ నచ్చకపోతే ఏ హీరోనైనా రిజెక్ట్ చేసే సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తుందో లేదో చూడాలి.