టాలీవుడ్, బాలీవుడ్ లలో ప్రస్తుతం బయోపిక్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇండియాకు తొలి ఒలంపిక్ మెడల్ సాధించిన కరణం మల్లేశ్వరి బయోపిక్ తెరకెక్కడానికి రంగం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత కోన వెంకట్.. కరణం మల్లేశ్వరి బయోపిక్ ను ఫ్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. నిన్న కరణం మలేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

అయితే కరణం మల్లేశ్వరి పాత్రలో ప్రముఖ నటి నిత్యా మీనన్ ను నటింప చేయాలనీ సంప్రదించారట. అయితే ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందంటున్నారు. ఇక మొదట ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర కూడా తనకే వచ్చిందని కానీ కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశానని గతంలో నిత్యా మీనన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మరో క్రేజి పాత్రను నిత్యా వదులుకుందంటున్నారు. ఆమె ఒప్పుకుని ఉంటె నిన్ననే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ఉండేదని టాక్ వినిపిస్తుంది.

తేజ దర్శకత్వంలో అనుష్క..?

ఆంధ్రజ్యోతి పత్రిక వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు..!