తెలంగాణతో పాటు రాయలసీమ ప్రాంతంలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. కొన్ని చోట్ల అయితే వేసవి కాలాన్ని తలపిస్తూ ఎండలు కాయడంతో పంట సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల మొదట్లో వరుసగా ఒక వారం రోజులు వర్షాలు పడి ఇప్పుడు ముఖం చాటేశాయి. ఇక గత రెండు రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.

మరోవైపున కర్ణాటకలో కురుస్తున్న బారి వర్షాలతో ప్రాజెక్ట్ లన్ని నిండు కుండలా మారిపోయి ప్రకాశం బ్యారేజి కింద ఉన్న లోతట్టు ప్రాంతాలతో పాటు గ్రామాలకు… గ్రామాలే వరదలలో మునిపోతున్నాయి. ఇక ఒకవైపున తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో వర్షాలు లేక పంట ఎండిపోతుంటే మరోవైపున కోస్తా ప్రాంతం కృష్ణ, గుంటూరు జిల్లాలో వరదల తాకిడికి పంటలన్నీ నాశనం అవుతున్నాయి. ఒక చోట అతివృష్టి, మరోచోట అనావృష్టి రావడంతో రెండు రాష్ట్రాలలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.