ప్రతి ఏడాది నవంబర్ మాసంలో గెడ్డం గీయించుకోకుండా చాలా మంది క్యాన్సర్ బాధితుల కోసం ఆ మొత్తాన్ని అందించడం కోనేళ్ళుగా ఆనవాయితీగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల పురుషులు నవంబర్ మాసంలో ఈ సామజిక అవగాహన నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 1999లో మెల్ బోర్న్ లో కొందరు యువకులు దీన్ని ప్రారంభించారు.

దీని సదుద్దేశం తెలిసిన చాలా మంది ప్రపంచవ్యాప్తంగా “నో షేవ్ నవంబర్”ను పాటిస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొంది ఆచరించబడుతుంది. ఈ ఏడాది కూడా నవంబర్ రావడంతో చాలా చోట్ల పురుషులు పాటిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సామజిక స్పృహ కోసం క్యాన్సర్ బాధితుల కోసం చేపడుతున్న ఈ కార్యక్రమా మీకు నచ్చితే మీరు పాటించి మీరు మిగిల్చిన సొమ్మును క్యాన్సర్ బాధితులకు విరాళంగా ఇవ్వండి.