ప్రపంచంలో అత్యంత క్రూరమైన నియంత ఎవరంటే ముందుగా చెప్పే పేరు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేరే. అతడి పేరు చెబితే అగ్రరాజ్యం అమెరికానే హడలిపోతుంది. తన ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్లు నువ్వు యుద్ధానికి సై అంటే నేను డబుల్ సై అని తొడకొట్టే రకం. అక్కడ ప్రజలు కూడా కిమ్ పాలనతో చిత్ర హింసలకు గురవుతుంటారు.

ఈమధ్య అతడి ఆరోగ్యం క్షీణించిందని అతడు చనిపోతాడని అందరూ భావిస్తున్న వేళ ఉత్తర కొరియా ప్రజలు కూడా ఎలాగైనా కిమ్ పీడ విరగడవ్వాలని తమకు నూతన అధ్యక్షుడు కావాలని కోరుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కిమ్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పడంతో అప్పటి వరకు ధీమాగా అతడిపై ఇష్టానుసారంగా వార్తలు రాసుకొచ్చిన ఇంటర్నేషనల్ వార్త పత్రికలు కూడా సైలెంట్ అయిపోయాయి.

ఇక ఇప్పుడు కిమ్ కరోనా వైరస్ తో ప్రపంచదేశాలన్ని బాధపడుతుంటే, దానిపై పోరాటం చేస్తూ, వైరస్ వ్యాక్సిన్ కనుగొనే పనిలో ఉంటే ఇతగాడు మాత్రం తన అణుశక్తిని మరింత పెంచుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నాడట. దీనిపై ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ ఆసక్తికర విషయాలు చెబుతూ కిమ్ ఇటీవల తరచుగా కేంద్ర మిలిటరీ కమిషన్ తో సమావేశమవుతున్నారని, సైన్యాన్ని మరింత బలోపేతం చేయడం, మిలిటరీ ఎడ్యుకేషన్ సంస్థలను మరింత క్రియాశీలకంగా మార్చడం వాటి పాత్రను పునర్నిర్వహించడం వంటి వాటిపై దృష్టి పెట్టారని, దేశ రక్షణ వ్యవస్థలో రాజకీయ, సైనిక లోటు పాట్లను గుర్తించి పరిష్కార మార్గాలు వెతుకుతున్నారని చెప్పుకొచ్చింది.

అసలే రష్యా, చైనా అమెరికాతో యుద్ధానికి కాలు దువ్వుతున్న వేళ అమెరికాకు వ్యతిరేకంగా వారితో కలసి కిమ్ కూడా తన అణుశక్తి సత్తా ఏమిటో చూపించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కిమ్ జాంగ్ తో రష్యా, చైనా చర్చలు జరిపామని వారికి పూర్తి మద్దతు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

అశ్లీల చిత్రాలు చూస్తూ కిమ్ జాంగ్ కంట పడితే ఏమి చేస్తాడో తెలుసా

అసలు కిమ్ జాంగ్ కు శస్త్ర చికిత్సే జరగలేదట

కిమ్ జాంగ్ దెబ్బకు హడలిపోయిన దక్షిణ కొరియా