‘సాహో’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘జాన్’. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 18 నుండి ప్రారంభం కానుంది. 1970 కాలంలో సాగే ఈ సినిమా మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కబోతుంది.

ఈ సినిమాల్లో కొన్ని కీలక సన్నివేశాలను యూరప్ లో చిత్రీకరించబోతున్నారు. రెండు సంవత్సరాల నుండి కష్టపడి చేసిన ‘సాహో’ సినిమా అనుకున్నంతగా విజయవంతం కాకపోవడంతో సమయం వృధా అయ్యిందనుకుంటున్న ప్రభాస్.. ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు.

ఇక సైరా సినిమాకు సంగీతం అందించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకు అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేసాడట. ప్రభాస్ మాతృ సంస్థ గోపికృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటించే అవకాశం ఉంది ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారు.