తమిళ స్టార్ దర్శకుడు అట్లీ.. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఎప్పటి నుండో సోషల్ మీడియా హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై అట్లీ స్పందించాడు. త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు.

అట్లీ ప్రస్తుతం విజయ్ హీరోగా ‘విజిల్’ సినిమాను తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఫంక్షన్ లో మాట్లాడిన ఆయన ఖచ్చితంగా ఎన్టీఆర్ తో తన సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. గతంలో విజయ్ తో రెండు హిట్ సినిమాలను తీసిన అట్లీ.. ఇప్పుడు ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకుంటున్నాడు. ఇక ఈ సినిమా దీపావళి పండగ కానుకగా విడుదల అవుతుంది.