బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రతి ఏడాది బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ తో కలసి ఈవెంట్ ఒకటి నిర్వహిస్తుంటాడు. ఈ ఏడాది నిర్వహించ బోయే ఈవెంట్ పేరు “Da-Bangg” అని పేరు పెట్టారు. ఈ ఈవెంట్ ఈ ఏడాది హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో నిర్వహించాలని తలచారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా, ప్రభు దేవా, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇంకా చాల మంది స్టార్స్ రానున్నారు.

హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ కు సల్మాన్ ఖాన్… టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ను కూడా ఆహ్వానించాడట. తారక్… సల్మాన్ ఖాన్ షోకు వస్తానని చెప్పడంతో అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. మెగా హీరో రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఈ షోకు తప్పకుండా రామ్ చరణ్ వస్తాడు. రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఈ షోకు రావడంతో వీరిద్దరూ కలసి చేయబోతున్న “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమం సల్మాన్ ఖాన్ షో నుంచే ప్రారంభవుతుందేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •