గత ఐదేళ్లలో ఎన్టీఆర్ అనే పేరు తెలుగుదేశం పార్టీలో వినిపించేది కాదు, అతడు ఒక సినిమా ఆర్టిస్ట్ అని వాడికి రాజకీయాలతో పనేమిటని వాడు ఒక పిల్లకుంక అని టీడీపీ అధినేత సుపుత్రుడు నారా లోకేష్ నుంచి సీనియర్ నాయకులంతా అన్నవారే. దానికి కారణం వారు ఆ సమయంలో అధికారంలో ఉండటంతో పాటు అధినేత చంద్రబాబు నాయిడు ప్రసన్నం కోసం, చినబాబు కళ్ళలో ఆనందం చూడటం కోసం. గత ఐదేళ్లలో చినబాబు లోకేష్ కు కోపం వస్తే వారి పదవి ఊస్టింగ్ అని… చినబాబు ఆనందించేలా ఏదైనా కార్యక్రమా చేపడితే వారి స్థానం పైపైకే అని చినబాబు లోకేష్ భజన కార్యక్రమం పూనుకున్నారు, చివరికి ఆ చినబాబే మంగళగిరిలో దారుణంగా ఓటమి పాలయ్యాడు

ఇక గత ఐదేళ్లుగా ఎవరైతే ఎన్టీఆర్ వద్దనుకున్నారో నిన్న వారంతా అతడికి పుట్టినరోజు శుభకాంక్షలు చెప్పడానికి సోషల్ మీడియాలో పోటీపడ్డారు. ఎప్పుడులేనట్లు ఎన్టీఆర్ కు నారా లోకేష్ దగ్గర నుంచి కింజరాపు అచ్చంనాయుడు, చింతమనేని ప్రభాకర్, బోండా ఉమా, కేశినేని శ్వేతా, సోమిరెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంట శ్రీనివాసరావు, గల్లా జయదేవ్, చినరాజప్ప… ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా టీడీపీ నాయకులు మొత్తం ఎన్టీఆర్ భజన చేశారు.

దానికి కారణం రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీలో వారి భవిష్యత్ అందకారంగా కనపడటమే, అందుకే ఎన్టీఆర్ ను బాహుబలిగా చూస్తూ ఎప్పుడు లేనట్లు భజన కార్యక్రమానికి పూనుకున్నారు. ఇక నారా లోకేష్ ను నమ్ముకుంటే కష్టాలు తప్పవని, అతడు ఒక బల్లాలదేవుడని… మనల్ని ఎప్పటికైనా కాపాడేది బాహుబలి ఎన్టీఆర్ అని స్తుతిస్తున్నారు. టీడీపీ నాయకులు ఎన్ని భజనలు చేసిన చంద్రబాబు పొడిచే వెన్నుపోట్లు గురించి తెలిసిన ఎన్టీఆర్ అటువెళ్లే సమస్యే లేదని తెలుస్తుంది.

ఎవడు మనోడు, ఎవడు పగోడు అనేది ఎన్టీఆర్ కు బాగా తెలిసొచ్చింది

నాగబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి