బాహుబలి సినిమా తరువాత రాజమౌళి రేంజ్ దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది. రాజమౌళి కూడా తనకు నచ్చిన, తాను మెచ్చిన హీరోల సినిమాలు విడుదలవుతున్నప్పుడు వారి కోసం విడుదలైన రోజే సినిమాను చూసి, ట్విట్టర్ వేదికగా స్పందించడం గత కొంత కాలంగా చూస్తూనే ఉన్నాం. ఇక రాజమౌళికి అత్యంత సన్నిహితుడు సాయి కొర్రపాటి సినిమాలనైతే మొదటి రోజు మిస్ కాకుండా చూస్తూ, సినిమా చాల బాగుందని తప్పకుండా చూడమని తన అభిమానులకు సలహాలిస్తుంటారు. రాజమౌళి స్పందనను బట్టి కూడా ఒకోసారి సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగిన సందర్భాలు లేకపోలేదు.

ntr biopic

కానీ “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా విడుదలై దాదాపుగా 10 రోజులు కావస్తున్నా, ఇంతవరకు రాజమౌళి “ఎన్టీఆర్ బయోపిక్” మీద స్పందించకపోవడంతోనే ఎక్కడో తేడా కొడుతుంది. రాజమౌళి ఇన్ని రోజులు మొహమాటానికి పోయి, తన ఆప్తుల కోసం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తుండేవారు. కానీ రాజమౌళిని నమ్ముకొని సినిమాకు వెళ్లిన వారు కొన్ని సినిమాలు ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. తన ఆప్తుల కోసం బాగోలేని సినిమా కూడా చాల బాగుందని చెప్పడంతో ప్రేక్షకులలో కూడా రాజమౌళి రివ్యూస్ పట్ల అసంతృప్తి నెలకొని ఉంది. ఇది ముందుగానే గమనించిన రాజమౌళి తన స్నేహితుల సినిమాలు విడుదలవుతున్నా, మంచి సినిమాకే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, తన క్రెడిబిలిటీని నిలుపుకునే పని చేస్తున్నారు.

రాజమౌళికి సీనియర్ ఎన్టీఆర్ అంటే చాల ఇష్టం, కానీ బాలకృష్ణ నటించిన “ఎన్టీఆర్ బయోపిక్” సినిమాకు ఇప్పటి వరకు తాను చూసినట్లు ఎక్కడా చెప్పకపోవడంతోనే రాజమౌళిని అభిమానించే బాలకృష్ణ అభిమానులు కొంత ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తుంది. ఒకవేళ రాజమౌళి బిజీగా ఉండి “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా చూడలేదా లేక తనకు ” ఎన్టీఆర్ బయోపిక్” సినిమా నచ్చలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇంత వరకు తన తాత సినిమాపై స్పందించకపోవడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

NTR Biopic Team

“ఎన్టీఆర్ బయోపిక్” ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన తారక్, సినిమా విడుదల రోజు మాత్రం ఎక్కడ కనిపించే లేదు. అసలు ఇంత వరకు తారక్ సినిమా చూశాడో లేదో కూడా తెలియదు. ఇక ” ఎన్టీఆర్ బయోపిక్” కు సంబంధించి దాదాపుగా చాల మంది అగ్ర హీరోలు సినిమాపై స్పందించడానికి నిరాకరించారు. ఒక్క మహేష్ బాబు మాత్రమే ఈ చిత్రాన్ని క్లాసిక్ గా అభివర్ణించాడు. మహేష్ బాబు లాంటి వాడే స్పందించినప్పుడు రాజమౌళి, ఎన్టీఆర్ లాంటి వారు కూడా సింపుల్ గా సినిమా బాగుంది అని ఒక ట్విట్ పెట్టి ఉండవచ్చు.

రాజమౌళితో పాటు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పటి వరకు సినిమా గురించి మాట్లాడకపోవడంతో ఇండస్ట్రీలో కొంత చర్చనీయాంశంగా ఉంది. “ఎన్టీఆర్ బయోపిక్” సినిమాలో ఏఎన్ఆర్ పాత్రకు కూడా ప్రాముఖ్యత ఉంది. ఆ రోల్ ను అక్కినేని నాగేశ్వర రావు మనుమడు సుమంత్ నటించాడు. ఈ సినిమా గురించి నాగార్జున కూడా ఏమి మాట్లాడకపోవడంతో సినిమా ఇండస్ట్రీలో కనపడకుండా ఏదో జరుగుతుందని, ఇండస్ట్రీ మొత్తం రెండుగా విడిపోయిందన్న వ్యాఖ్యలు తెర మీదకు వస్తున్నాయి.      

ntr biopic

ఇక “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా “కథానాయకుడు” పేరుతో వచ్చిన మొదటి భాగానికి ఇలా ఉంటే రెండవ భాగం పరిస్థితి ఏమిటని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. మొదటి భాగం అంతా చిత్ర సీమలో ఎన్టీఆర్ ఎలా ఎదిగాడన్న దాని గురించే చూపించారు. కానీ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు మొదటి భాగం “కథానాయకుడు”కే స్పందించకుండా ఉంటే, రెండవ భాగంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టి, చంద్రబాబు నాయుడుని పొగిడే సన్నివేశాలకు ప్రాధాన్యత కల్పించి, చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటు సీన్ కూడా తొలగించడంతో ఎన్టీఆర్ రాజకీయ జీవితం అంతా కల్పిత పాత్రలతో నింపేస్తే చిత్ర సీమ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చే అవకాశమే ఉండదని అంటున్నారు, ఇదే రీతిలో ఇప్పటికే ఈ చిత్రంపై విమర్శలు కురిపిస్తూ ఎన్టీఆర్ ఆరోజులలో ఎలా ప్రవర్తించేవాడని అప్పటి నెల రోజుల ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు, మీడియా చానెల్స్ కు ఇంటర్వూస్ ఇస్తూ మరింత రెచ్చగొట్టేలా తన వ్యాఖ్యలు చేయడం కూడా ఎన్టీఆర్ రాజకీయ జీవితం కొంత మసకబారే అవకాశం ఉంది.