బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితగాధను చిత్రంగా మలచడానికి తానే స్వయంగా నిర్మాతగా మారి “ఎన్టీఆర్ బయోపిక్” అనే చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించారు. మొదటి భాగం సంక్రాంత్రి కానుకగా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన మొదటి రోజు సినిమాపై అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో నిర్మాతలు సంబరాలు చేసుకున్నారు. కానీ సినిమా బాగుందని టాక్ వచ్చిన కలెక్షన్స్ ఆశించినత లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి అయినా వెనక్కు వస్తుందని, ఇక రెండవ భాగం “మహానాయకుడు” ఉండనే ఉందని అందరూ అనుకున్నారు.

ntr biopic

కానీ “కథానాయకుడు” సినిమాకు ఎవరు ఊహించనంత నష్టం వస్తుందని, కొన్ని ఏరియాస్ లో అయితే ఇది వరకు ఉన్న సినిమా నష్టాలను రికార్డు బద్దలు కొట్టిందని తెలుస్తుంది. ఈరోజు ఒక ప్రముఖ నేషన్ పేపర్ లో ఈ సినిమా గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ పత్రిక తెలియచేస్తూ బాలకృష్ణకు ఒక సెంటిమెంట్ ఉందని ఆ సెంటిమెంట్ నే సినిమాను దెబ్బతీసిందా అనే రీతిలో వ్యాఖ్యానించారు. బాలకృష్ణ ఎప్పుడు నిర్మాతగా మారుదామని ప్రయత్నించినా విఘాతం కలుగుతుందట.

ఇప్పటి వరకు విడుదలైన అన్ని బయోపిక్ చిత్రాలు విజయం సాధిస్తే, “ఎన్టీఆర్ బయోపిక్” మాత్రం ఫెయిల్ అవ్వడం కొంత కలవరానికి గురిచేస్తుంది. ఇక ఈ సినిమాను ఇప్పటి వరకు బాలకృష్ణ సినిమాల మార్కెట్ కన్నా ఎక్కువ పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు దాదాపుగా పెట్టిన పెట్టుబడిలో సగం రావడం కూడా గగనంగా మారిందని తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ కొంతలో కొంత ఊరట ఏమిటంటే “ఎన్టీఆర్ బయోపిక్” లో రెండవ బాగమైనా “మహానాయకుడు” సినిమా కూడా మొదటి సినిమా విడుదల చేసిన వారికే ఇస్తామని ముందే మాట ఇచ్చారని తెలుస్తుంది.

Balakrishna krish

ఇక “ఎన్టీఆర్ బయోపిక్” సినిమాకు మంచి రివ్యూస్ ఇచ్చినా సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవ్వడానికి కారణం ఒక వర్గం ప్రేక్షకులు దాదాపుగా సినిమాను బ్యాన్ చేసినంత పని చేశారట. దీనితో “ఎన్టీఆర్ బయోపిక్” సినిమాను అడ్డుపెట్టుకొని వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కళలు కన్న వారికి ఈ సినిమా రిజల్ట్స్ దారుణంగా దెబ్బతీసినట్లు తెలుస్తుంది. “కథానాయకుడు” సినిమా మొత్తం ఎన్టీఆర్ చిత్ర సీమకు సంబంధించి తానూ ఏవిధముగా ఎదిగాడు అన్న దానిని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమానే ప్రేక్షకులు ఆదరించకపోతే, ఇక రెండవ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న “మహానాయకుడు” సినిమాను ఆదరించడం కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి. రెండవ భాగానికి ఫామిలీస్ వెళ్లి చూసే పరిస్థితి ఉండదు. అది అంత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని సినిమాను తీయడంతో కొన్ని వర్గాలు సినిమాకు దాదాపుగా దూరమవుతారు. మరి ప్రేక్షకులు రెండవ భాగాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు కొంత ఆసక్తిగా మారింది.