నందమూరి తారకరామారావు జీవిత గాధపై అతని తనయుడు నందమూరి బాలకృష్ణ నటించిన “ఎన్టీఆర్ బయోపిక్” నిన్న మొదటి భాగం విడుదలైంది. సినిమాకు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా యూనిట్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాలో మొత్తం ఎన్టీఆర్ సినిమా జీవిత చరిత్ర గురించి ఉంటే, రెండవ భాగమంతా రాజకీయ ప్రస్థానంతో నిడిపోనుందని “ఎన్టీఆర్ బయోపిక్” చివరి సీన్ చూస్తేనే తెలుస్తుంది.

“ఎన్టీఆర్ బయోపిక్” సినిమా చివరిగా ఎన్టీఆర్ “తెలుగుదేశం పార్టీ”ని ప్రకటించడంతో సినిమా ముగుస్తుంది. ఇక ఆ తరువాత జరిగే పరిణామాలు రెండవ భాగంలో చూపించనున్నారు. కానీ రెండవ భాగంలో చాల వరకు కూడికలు, తీసివేతలు ఎక్కువగానే ఉంటాయని తెలుస్తుంది. జరిగినవి జరగనట్టుగా, జరగనవి జరిగినట్టుగా కల్పితాలు రెండవ భాగంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం గట్టిగానే ప్రయత్నించారట. అసలు చంద్రబాబు లేకపోతే ఎన్టీఆర్ లేడన్న రీతిలో రెండవ భాగాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టే క్రమంలో ముఖ్యంగా ఎన్టీఆర్ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర రావు ప్రధాన పాత్ర పోషించారు. అతనకు ఎంత వరకు సినిమాలో అవకాశం ఇచ్చారో తెలియదు గాని, చంద్రబాబు నాయుడునే కీర్తిస్తూ సినిమా ఉంటే మాత్రం ఎన్టీఆర్ వీరాభిమానులు నుంచి విమర్శలు ఎదుర్కొనక తప్పదు.

ఇక నాదెండ్ల వెన్నుపోటుతో ఎన్టీఆర్ పదవీచ్యుతుడు అవడం, తరువాత నెల రోజులకు ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా అధిష్టించి క్రమంలో చంద్రబాబు నాయుడుని ఒక గొప్ప హీరో లెక్క చూపించారట. కానీ చంద్రబాబు పొడిచిన వెన్నుపోటుని మాత్రం తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడానికి అప్పట్లో అలా చేయవలసి వచ్చిందన్న రీతిలో చంద్రబాబుని నొప్పించకుండా చిత్రీకరణ చేసినట్లు తెలుస్తుంది. ఒక నాదెండ్ల గురించి తప్పుగా సినిమాలో ఉంటే నాదెండ్ల భాస్కర రావు ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికే నాదెండ్ల తన గురించి సినిమాలో తప్పుడుగా ఉంటే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గురించి చాల నిజాలు చెప్పవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇన్ని పరిణామాల మధ్య చంద్రబాబు నాయుడు “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా తరువాత కీర్తితో ప్రకాశింప బడతాడా లేక విమర్సల పాలవుతాడో ఫిబ్రవరి 7వ తారీకు వరకు ఆగవలసిందే.