ఈరోజు నందమూరి తారకరరావు జీవితగాదాకు సంబంధించి తెరకెక్కిన “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అర్ధరాత్రి నుంచే పలు ప్రాంతాలలో సినిమా షోలు నడుస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ట్విట్టర్ వేదికగా తెలియచేస్తున్నారు. ట్విట్టర్ లో “ఎన్టీఆర్ బయోపిక్”” సినిమాకు సంబంధించి మిశ్రమ స్పందన కనపడుతుంది. కొంత మంది సినిమా అద్భుతంగా ఉందని ట్విట్ చేస్తుంటే మరికొంత మంది మాత్రం సినిమా అనుకున్నంత లేదని, మొదటి అర్ధభాగం కొంచెం బోరింగ్ గా ఉందని, రెండవ అర్ధభాగం సినిమాను నడిపించిన విధానం బాగుందని తెలియచేస్తున్నారు.

బాలకృష్ణ నటించిన “ఎన్టీఆర్ బయోపిక్” సినిమాపై అభిమానులతో పాటు, ప్రేక్షకులలో కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించనుంది. మొదటి భాగం “కథానాయకుడు” ఈరోజు విడుదలైతే, రెండవ భాగం “మహానాయకుడు వచ్చే నెల ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయి రివ్యూ కోసం మరికొంత సేపు వెయిట్ చేస్తే సినిమా పరిస్థితిపై ఒక అంచనాకు రావచ్చు.