రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నిర్మితమవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించి టైటిల్ విడుదల చేయడంతో పాటు రామ్ చరణ్ పుట్టినరోజు నాడు అతడి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందులో ఎన్టీఆర్ తెలంగాణ యశలో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ వీడియోకే హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఇక రామ్ చరణ్ సీతారామరాజుగా తన పవర్ ప్యాక్ చూపించాడు.

మే 20వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు ఎన్టీఆర్ కు సూపర్ గిఫ్ట్ ఇవ్వడానికి రాజమౌళి ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడో అని అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చించుకోవడం జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు విడుదల చేసే వీడియోలో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇస్తాడేమో. ఈ చిత్రంలో సంక్రాంతి కానుకగా 2021 న విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.