“ఎన్టీఆర్ బయోపిక్” సినిమాలో మొదటి భాగంగా వచ్చిన “కథానాయకుడు” సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలలో ఒదిగిపోయాడని, సినిమా మొత్తం ఎన్టీఆర్ సినీ జీవిత చరిత్ర గురించి తెలుసుకునే ప్రేక్షకులు తెలుసుకునే అవకాశం ఉందని సినిమా ఇండస్ట్రీ మొత్తం కొనియాడారు. మొదటి రోజు “కథానాయకుడు” సినిమాకు అన్ని ఏరియాలు కలిపి దాదాపుగా 7.50 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని చెబుతున్నారు.

ఇక రెండవ రోజు “కథానాయకుడు” సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి బుజ్ వచ్చినా దారుణంగా కలెక్షన్స్ డ్రాప్ అయినట్లు తెలుస్తుంది. కొన్ని చోట్ల అయితే థియేటర్ కరెంటు బిల్స్ కూడా రాలేదని అంటున్నారు. ఇది మరీ నమ్మశక్యంగా లేకపోయినా పరిస్థితి మాత్రం అందుకు బిన్నంగా ఏమి లేదని, రెండవరోజు అన్ని ఏరియాలు కలుపుకొని కోటి రూపాయలకు అటు ఇటుగా షేర్ మాత్రమే కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీనితో చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కొంత ఆందోళనలో ఉన్నారు.

నిన్న “పేటా” సినిమా విడుదలైనా “కథానాయకుడు” సినిమా ఆడుతున్న థియేటర్స్ మాత్రం కదిలించలేదు. అయినా పరిస్థితి ఇంత దారుణంగా ఉండటంతో ఈరోజు విడుదలైన “వినయ విధేయ రామ”, రేపు విడుదల కాబోతున్న “ఎఫ్2” సినిమాలతో మరింత కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Nandamuri_Blakrishna_Megastar_CHiranjeevi

ఈపరిస్థితి అంతటికి ముఖ్య కారణం బాలకృష్ణ – చిరంజీవి కుటుంబాల మధ్య మరియు వారిద్దరి అభిమానుల మధ్య నడుస్తున్న వార్ నే కారణమని తెలుస్తుంది. మెగా అభిమానులతో పాటు, జనసేన కార్యకర్తలు, వైసిపి కార్యకర్తలు ” కథానాయకుడు” సినిమాను థియేటర్ లో చూడకూడదని నిర్ణయించుకోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని, ఇలాంటి పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో రావడం దారుణంగా చెప్పుకోవచ్చు. అభిమానుల మధ్య గొడవలతో సినిమాను నిర్మించిన నిర్మాత భారీగా దెబ్బతినడమే కాకుండా వారిని నమ్ముకొని సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారనుంది. ఇలాంటి సంస్కృతి నుంచి బయట పడేందుకు వారిరువురు హీరోలు ఒక చోట కూర్చొని గొడవకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ముందు ముందు నిర్మాతలకు చాల ఇబ్బందిగా మారుతుంది.