‘కేజీఎఫ్‌’తో భారీ యాక్షన్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. అంతకుముందే ఈ సినిమా స్టోరీ లైన్ మాత్రమే చెప్పి ఎన్టీఆర్ తో ఓకే అనిపించుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ ను వినిపించాడట. ఇక ఎన్టీఆర్ కు ప్రశాంత్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా బయోవార్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ సరికొత్త మేకోవర్ లో మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ‘కేజీఎఫ్‌ 2’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్.. ‘RRR’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. వీరిద్దరి కమీట్ మెంట్స్ అయిన తరువాత ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా త్వరలో ఓ బిగ్ ఎనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తుంది. 200 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

సాయి ధరమ్ తేజ్ అందించిన సహాయానికి ప్రశంసల వర్షం

మందు బాబులు ఎవరి కర్మకు వారే బాధ్యులు

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ భర్తపై ఓ మహిళ షాకింగ్ వ్యాఖ్యలు.. ఘాటుగా రిప్లై ఇచ్చిన సోనమ్..!

ఆ రెండు సీరియల్స్ ను బిగ్ బాస్ బీట్ చేయలేకపోతుంది