తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందట. ఈ పాత్ర చేయమని బాలకృష్ణ ను సంప్రదించగా ఆయన ఆసక్తి చూపడం లేదట. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణను నటింపజేయాలని చిత్ర యూనిట్ ఆయనను కోరిన కూడా సున్నితంగా తిరస్కరించారట. బాలకృష్ణ ఆ పాత్ర చేస్తే సినిమాకు నిండుతనం వస్తుందన్న కారణంగా బాలకృష్ణే ఆ పాత్ర చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు. కానీ ఆయన ఇంటరెస్ట్ చూపించకపోవడంతో ఎన్టీఆర్ పాత్రను సినిమా నుండి తొలగించారట.

ఇక గతంలో క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రెండు భాగాలూ డిజాస్టర్ లుగా మిగిలాయి. దీంతో బాలకృష్ణ.. ‘తలైవి’లో ఎన్టీఆర్ పాత్ర చేయకపోవడానికి కారణంగా చెబుతున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను ఆపివేశారు.