అప్పట్లో అమ్మోరు సినిమా విడుదలైనప్పుడు అమ్మవారి విగ్రహాలను థియేటర్లలో పెట్టి ఒక దేవాలయంలా మార్చేశారు. సినిమా ఆడుతున్న అన్ని రోజులు థియేటర్ మొత్తం పొగ వేయడంతో పాటు, థియేటర్ బయట హుండీలు పెట్టి హారతులను ప్రేక్షకులకు ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఈ కొత్త ప్రయోగంతో ప్రజలు పూనకం వచ్చినట్లు థియేటర్స్ కు బారులు తీరి సినిమాను సంచలన విజయం వైపు నడిపించారు.

తరువాత కాలంలో అమ్మోరు సినిమా తరహాలోనే ఎలాంటి భక్తి రస సినిమా ఏది విడుదలైనా థియేటర్స్ లో ఈ తరహా అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు అదే తరహాలో బాలకృష్ణ నటించిన “ఎన్టీఆర్ బయోపిక్” సినిమాకు ఎన్టీఆర్ విగ్రహాలను పెట్టాలని చిత్ర యూనిట్ బావిస్తుంది. ఇప్పటికి దీని తగట్లు దాదాపుగా వంద థియేటర్స్ ను ఎంపిక చేసి ఎన్టీఆర్ విగ్రహాలు నెలకొల్పడానికి సిద్ధమవుతుంది. ఇక ఎన్టీఆర్ విగ్రహాలు చూసిన అభిమానులు ఒకటి, నాలుగు సార్లు థియేటర్స్ కు వచ్చి సినిమాను విజయం వైపు పయనింప చేస్తారని చిత్ర యూనిట్ ఆలోచన.

ఇలాంటి తరహా ప్రయోగాలు తమిళనాడులో ఎక్కువగా దర్శనమిస్తాయి. మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు వ్యక్తి పూజ చేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు చిత్ర యూనిట్ సరికొత్త ఆలోచనతో ఇక రాబోయే రోజులలో విడుదలవ్వబోతున్న బయోపిక్ సినిమాలకు కూడా ఇదే తరహాలో విగ్రహాలు ప్రతిష్టింప చేస్తారేమో చూడాలి.
  •  
  •  
  •  
  •  
  •  
  •