ఎన్టీఆర్ తాజా చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “అరవింద సమేత” సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి మొదటి లుక్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో చిత్ర యూనిట్ కు షాక్ తగిలింది. ఎన్టీఆర్ లుక్ తో పాటు సినిమాలోని కీలకమైన సన్నివేశానికి సంబంధించిన ఫోటో ఒకటి బయటకు రావడంతో ఎన్టీఆర్ తో పాటు, త్రివిక్రమ్ కూడా చాల సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది.

ఎన్టీఆర్ సినిమాలో నాగబాబు ఒక ప్రత్యేకమైన పాత్ర వేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫోటోలు ఇలా విడుదలైతే సినిమా స్టోరీ బయటకు తెలిసే  ప్రమాదముందని, ఇక నుంచి షూటింగ్ స్పాట్ లో ఎవరు తమ సెల్ ఫోన్స్ తో రావడానికి వీలు లేదని ఎన్టీఆర్ గట్టిగా చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై చిన్నబాబు నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags : Ntr, Aravinda Sametha, NTR New Movie Aravinda Sametha, Nagababu, Trivikram Srinivas