త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపారంలో” సినిమా గత సంక్రాంతికి విడుదలై ముంచాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేయనున్నాడా అని గత కొద్ది రోజులుగా పెద్ద డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ రావడంతో పాటు జూన్ లో ఎన్టీఆర్ హీరోగా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు కూడా ఫిల్మ్ వర్గాలలో వినపడుతుంది.

క్లాస్ సినిమాలను చేస్తూ అందులో మాస్ టచ్ ఇచ్చే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ను పక్కింటి అబ్బాయి పాత్రలో చాలా సింపుల్ గా చూపించనున్నారట. ఇప్పటికే కథ సిద్ధం అయినా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉండటంతో ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెల్లనుంది.

ఈ సినిమాను త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాత హారిక హాసిని బ్యానర్ నిర్మాత చినబాబు నిర్మిస్తుండగా అతడితో నిర్మాణ భాగస్వామ్యంలో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ పాలుపంచుకోనున్నారు. ఈ సినిమా 2021 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమా వేసవికి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ‘అరవింద సామెత” సినిమాతో మంచి హిట్ కొట్టిన త్రివిక్రం – ఎన్టీఆర్ ఈ సినిమాతో కూడా మరొక హిట్ కొడతారేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •