ఓ మహిళా పారిశ్రామికవేత్త తమిళనాడులోని కోయంబత్తూరులో భిక్షం మెత్తుకుంటుంది. స్వీడెన్‌ దేశానికి చెందిన కిమ్‌ మహిళ పారిశ్రామికవేత్త. ఈమె భిక్షం ఎత్తుకోవడం స్థానికులను ఆశ్చర్య పరుస్తుంది. కొన్ని నెలల క్రితం కోవైలోని ఈషాయోగా కు చేరుకున్న కిమ్‌.. అక్కడ పేద, బడుగు, బలహీన వర్గాలకు సహాయం చేస్తుంది. అయినా ఆమెకు మానసిక ప్రశాంతత దొరక్కపోవడంతో రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ రోడ్ల మీద భిక్షం ఎత్తుకుంటుంది. ఇక జనాలు ఇచ్చిన ఐదు, పది రూపాయలను తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. కాగా ధనవంతురాలైన ఓ పారిశ్రామికవేత్త ఈ విధంగా భిక్షమెత్తడం స్థానికులను ఆశ్చర్య పరుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •