అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలల కాలంలోనే ఎన్నో కొత్త పథకాలను తీసుకువచ్చి సంచలనం సృష్టిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అక్టోబర్ 10న అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో మరో కొత్త పధకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన అనంతపురంలో ప్రారంభించబోతున్నారు. 5.4 కోట్ల మందికి కంటి పరీక్షలతో పాటు అవసరమైన శస్త్ర చికిత్యలను ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుంది.

వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా మొదటి దశలో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోనూ అన్ని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల అన్నింటిలోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి, రెండు దశల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా మూడు,నాలుగు, ఐదు దశల్లో మిగిలిన వారందరికీ ఈ పరీక్షలు నిర్వహిస్తారు. కంటి వెలుగుకు సంబంధించిన సామగ్రి, పరికరాలు,మందులును అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.