దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. కరోనా మహమ్మారి భారిన పడి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక ఎమ్మెల్యే కరోనా బారినపడి మృతి చెందారు. కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయిన ఒడిశా ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి(65) పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

ఇక ప్రదీప్ మహారథి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దేశం అత్యవసర సమయంలో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆయనను అరెస్ట్ చేశారు. ఇక మహారధికి సెప్టెంబర్ 14న కరోనా పాజిటివ్ గా తేలింది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మళ్ళీ పరిస్థితి విషమించడంతో మరణించారు. ఇక ప్రదీప్ మహారథికి భార్యా ప్రతివా, కుమారుడు రుద్ర ప్రతాప్, కుమార్తె పల్లవి ఉన్నారు.

డ్రగ్స్ వ్యవహారంలో దొరికిన సంజన రేంజ్ మాములుగా లేదుగా

టాలీవుడ్ ఇండస్ట్రీపై పట్టుకోసం సీఎం జగన్ కు దొరికిన మరో అస్త్రం

వైసీపీ కేంద్ర బీజేపీలో చేరడానికి సిద్ధమా? కానీ కండిషన్స్ అప్లై

సంచలన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్