చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంభానికి చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. మెహబత్తా పట్టణ సమీపంలో ఈ ఘటన జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడడంతో కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

మృతి చెందిన వారిలో ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాధు చేస్తున్నారు. కలెక్టర్ శిఖా రాజపుత్ తివారి తక్షణ సహాయం క్రింద 25 వేల రూపాయలను అందించారు.