హైదరాబాద్ లో ఓ మహిళా డాక్టర్ కు కారు స్పీడుగా వెళ్లిందని చలానా రావడంతో షాకైన ఆ డాక్టర్.. పోలీసుల వద్దకు వెళ్ళింది. ఆ నెంబర్ తనదేనని కానీ ఆ కారు తనది కాదని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. నా నెంబర్ తో వేరే వారు కారు వాడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసింది. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు తప్పుడు నెంబర్ వాడుతున్న హై ఎండ్ కారు ఎవరిదో తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు.

ఇక హైదరాబాద్ బంజారాహిల్స్ లో నివసించే డాక్టర్ వనజా రఘునందన్ పేరుతో హోండా కారు టీఎస్ 09 ఈఎల్ 5679 నెంబర్ తో కారు రిజిస్టర్ అయ్యి ఉంది. అయితే గత నెల 20వ తేదీన మహబూబ్ నగర్ లో ఈ నెంబర్ మీద కారు ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నట్లు చలానా వచ్చింది. ఇక దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆ డాక్టర్ తాను ఆ రోజు ఎక్కడికి వెళ్లలేదని.. ఆ ఫొటోలో కారు తనది కాదని.. తన కారు నెంబర్ ను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. కారు నెంబర్ ను మార్చి నడుపుతున్న అతని వల్ల తాను ఇబ్బందుల్లో పడ్డానని ఆమె పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.