జపాన్ లోని టోక్యో నగరంలో జులై 24న ఒలింపిక్స్, ఆగష్టు 25న పారాలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఒలంపిక్స్ పై కరోనా వైరస్ ప్రభావం పడుతుందంటున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ దాటికి ఇప్పటికే 2000 పైగా ప్రజలు చనిపోయారు. ఇక 74000 మందికి ఈ వైరస్ సోకింది. ఇక 25 దేశాలకు ఈ వైరస్ విస్తరించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతుంది.

అయితే ఒలంపిక్స్ మీద ఈ ప్రభావం ఉందనడం తొందరపాటు అవుతుందనడం ప్రపంచ ఆరోగ్యసంస్థ ఉన్నతాధికారి అన్నారు. ఒలంపిక్స్ సంబంధించి ఇప్పుడే ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని యూఎన్ ఏజన్సీ ఎమర్జెన్సీ ప్రోగ్రాం మైకేల్ ర్యాన్ పేర్కొన్నారు. అయితే కరోనా ముప్పును అంచనా వేయడంతో అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీకి సహకరిస్తాం అన్నారు. రాబోయే రోజుల్లో వారితో కలసి పని చేస్తామని.. డిసెంబర్ లో వచ్చిన కరోనా వైరస్ గురించి క్రమం తప్పకుండా అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీతో ప్రపంచ ఆరోగ్యసంస్థ సంప్రదింపులు జరుపుతుంది.

ఇక కరోనా ప్రభావంతో చైనాలో అనేక క్రీడా కార్యక్రమాలు రద్దు అవగా కొన్ని క్రీడలను వాయిదా వేశారు. అయితే టోక్యో ఒలంపిక్స్ అర్హత ఈవెంట్లతో సహా మరికొన్ని పోటీలకు చైనా క్రీడాకారులను ఇతర దేశాలకు అనుమతించడం లేదు.