గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు పరిమితమైతే, జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. ఇక ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తాను పోటీ చేసిన రెండు చోట్ల దారుణమైన ఓటమిని చవిచూశాడు. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలడంతో చంద్రబాబు నాయుడు తన మిత్రుల చేత పవన్ కళ్యాణ్ తో పొత్తు ప్రతిపాదనలు చేస్తున్నాడట.

వచ్చే లోకల్ బాడీ ఎన్నికలకు ఇద్దరం కలసి పోటీ చేస్తేనే అధికారంలో ఉన్న వైకాపా పార్టీని ఎదుర్కోగలమని లేకపోతే చాల కష్టమని పేర్కొనడంతో జనసేన పార్టీ నుంచి కూడా సానుకూలమైన వాతావరణం కనపడుతుంది. మరో వైపు జనసేనతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ పార్టీ కూడా ఎదురు చూస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీతో వెళ్తే మేలా లేక బీజేపీతో వెళ్తే మేలు జరుగుతుందో అనేది జనసేన పార్టీ నాయకత్వానికి అర్ధకాక తర్జన భర్జన పడుతుందట. ఒకవైపున జనసేన, టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటే బీజేపీ బలపడాలని చూస్తుంటే… వీళ్లిద్దరు కలసి బలహీన పడకుండా ముందుకు వెళ్లేలా పావులు కదుపుతున్నారు. 


Tags: Janasena, tdp


  •  
  •  
  •  
  •  
  •  
  •