చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హీరో కమ్ కమెడియన్ శివాజీ ఆపరేషన్ గరుడ పేరుతో కొంత హల్ చల్ చేసాడు. ఈ ఆపరేషన్ గరుడతో చంద్రబాబు  నాయుడు ప్రబుత్వంపై బీజేపీ ప్రభుత్వం ఏవో కుట్రలు చేస్తుంది అంటూ ఏవేవో కథలు అల్లాడు. తరువాత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కూడ ఆపరేషన్ గరుడలో భాగమే అంటు తెలుగుదేశం శ్రేణులు కూడా నమ్మించి… టీడీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని నానా పాట్లు పడ్డారు. 

ఇక ఇప్పుడు “”ఆపరేషన్ గరుడ” లాంటి మరో ఆపరేషన్ పుట్టుకొచ్చిందట. దీని పేరు ” ఆపరేషన్ ఆగస్ట్” ఈ ఆపరేషన్ లో మొత్తం తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టేయాలని బీజేపీ పెద్దలు ఇప్పటికే స్కెచ్ వేసారట. దీనికి వెనుక స్క్రిప్ట్ రెడీ అయిందని త్వరలో ఈ సినిమా డైరెక్టర్ ముందుకొచ్చి టీడీపీ సంగతి తేల్చేపని మొదలెట్టి సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీతో డీ అనాలని బీజేపీ ఉవ్విళూరుతుంది. బీజేపీ ఊహించినట్లు “ఆపరేషన్ ఆగస్ట్” సత్ఫలితాలు ఇస్తుందో లేదో చూడాలి. అసలే తెలుగుదేశం పార్టీకి ఆగస్ట్ సంక్షోభం ఉండనే ఉంది.   

 
  •  
  •  
  •  
  •  
  •  
  •