పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ విమానాశ్రయం సమీపంలో పాకిస్తాన్‌ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే విమానం కూలిన ప్రాంతంలో పొగలు దట్టంగా వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.

ఇక ఈ విమానం ప్రజల ఇళ్ల మధ్య కూలడంతో నాలుగు ఇళ్ళు దెబ్బ తిన్నాయి. కొద్దిసేపట్లోనే ల్యాండింగ్ కావలసి ఉండగా ఇంతలోనే ఘోర ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య భారీగా ఉంటుందని కరాచీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఘటనతో కరాచీలోని అన్ని పెద్ద ఆస్పత్రుల్లో ఆరోగ్య శాఖ ఎమర్జెన్సీని ప్రకటించింది.

ఊపిరిపీల్చుకున్న చిత్ర యూనిట్.. రెండు నెలలు తర్వాత ఇండియాకు..!

బడా నిర్మాత ఇంట్లో తీవ్ర కలకలం..