వీరేందర్ సెహ్వాగ్ బ్యాటింగ్ కు వస్తున్నాడంటే ఒకప్పుడు ప్రత్యర్థికి దడ పుట్టాల్సిందే. అతడు కొట్టే ఫోర్లు, సిక్సులతో స్టేడియం మొత్తం ఫీల్డర్లను పరుగులు పెట్టిస్తాడు. ఇప్పుడు వీరేంద్రుడి తరం ముగిసిపోవడంతో కొత్త కొత్త బ్యాట్స్ మెన్ లు పుట్టుకొస్తున్నారు. వారిలో ముఖ్యంగా టీమిండియా నుంచి కోహ్లీ, రోహిత్ శర్మల పాత్ర టీమిండియా విజయాలలో అమోఘం అని చెప్పుకోవచ్చు.

పాకిస్థాన్ మాజీ ఆటగాడు అక్తర్ కూడా టీమిండియా ప్లేయర్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ వీరేంద్ర సెహ్వాగ్ కన్నా రోహిత్ శర్మ చాల మెరుగైన బ్యాట్స్ మెన్ అని అన్నాడు. వీరేందర్ సెహ్వాగ్ బాల్ ను బలంగా స్టేడియం మొత్తం ఎటు వైపైనా కొట్టగలిగిన సత్తా ఉందని, కానీ రోహిత్ శర్మకు కూడా అలాంటి టెక్నిక్ తో పాటు టైమింగ్ తో రకరకాల షాట్లు కొట్టగలడని, రోహిత్ శర్మ బ్యాటింగ్ కూడా చాల స్టైలిష్ గా ఉంటుందని అన్నాడు.

ఇక రోహిత్ శర్మ తన కెరీర్ లో మొదటి సారి ఓపెనర్ గా విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో దిగి రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు కొట్టి తన బ్యాటింగ్ ప్రతిభ ఏమిటో చూపించాడు. గతంలో 4 లేదా 5 స్థానంలో దిగే రోహిత్ ఓపెనర్ గా అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూపించడంతో వన్ డే, టీ20, టెస్ట్ అన్ని ఫార్మేట్ లలో ఇకనుంచి అతడే ఓపెనర్ గా బరిలోకి దిగనుండటం గమనార్హం.