పాకిస్థాన్ తో కలసి శ్రీలంక టీ20 సిరీస్ లో పాల్గొనవలసి ఉంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు శ్రీలంక టూర్ ను రద్దు చేసుకుంది. పాకిస్థాన్ వెళ్లి తాము ఆడలేమని తేల్చి చెప్పడంతో ఆ టూర్ దాదాపుగా రద్దయినట్లే తెలుస్తుంది. దీనిపై పాకిస్థాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ మాట్లాడుతూ శ్రీలంక క్రికెటర్స్ ను తన దేశానికీ రానివ్వకుండా భారత్ అడ్డుకుందని ఆరోపించడంతో దీనిపై శ్రీలంక మంత్రి ఘాటుగా బదులిచ్చాడు.

తాము భారత్ చెబితే సిరీస్ రద్దు చేసుకునే అంత స్థితిలో లేమని, 2009లో తమ ఆటగాళ్లు పాకిస్థాన్ పర్యటనలో ఉన్నప్పుడు తమ క్రీడాకారులు ప్రయాణిస్తున్న వాహనంపై బాంబుల దాడి జరగడంతో, ఇప్పుడు శ్రీలంకకు చెందిన 10 మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు తాము పాకిస్థాన్ వెళ్లి సిరీస్ ఆడలేమని చెప్పడంతోనే రద్దు చేసుకున్నామని తెలియచేశారు. తమ ఆటగాళ్లు అప్పుడు జరిగిన గాయాన్ని మర్చిపోలేకుండా ఉన్నారని శ్రీలంక మంత్రి అన్నారు. ఆర్టికల్ 370 తరువాత ప్రతి విషయం భారత్ కు ఎండగట్టి అంతర్జాతీయంగా భారత్ ను దోషిగా నిలబెట్టాలనుకుంటున్న ప్రతిసారి పాకిస్థాన్ చిక్కులలో పడుతుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •