దండిగా డబ్బున్న ధనిక దేశమైన చైనా మన పొరుగున ఉన్న నేపాల్, పాకిస్థాన్ ఇలా పలు పేద దేశాలకు డబ్బు ఎరగా వేసి మన దేశంపైకి ఉసిగొల్పుతూ ఎప్పటికప్పుడు సరిహద్దులలో చైనా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక మనకు ఆజన్మ శత్రువైన పాకిస్థాన్ అయితే చైనాతో జాన్ జిగిడిగా ఉంటూ మనపైకి ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దువ్వుతుంది. అలాంటి పాకిస్థాన్ చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ను నిషేధించి చైనాకు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

ఇప్పటికే భారత్ తో పాటు అమెరికాలో టిక్ టాక్ యాప్ నిషేధించడంతో చైనా ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. తమ దేశానికి చెందిన టెక్నాలజీ సంస్థలపై దాడి అనేలా మాట్లాడుతుంది. ఇప్పుడు అదే పని పాకిస్థాన్ కూడా చేయడం కాస్త షాకింగ్ అనుకోవచ్చు. కానీ పాకిస్థాన్ దీనికి సంబంధించి వివరణ ఇస్తూ టిక్ టాక్ యాప్ లో అశ్లీలత ఎక్కువగా ఉంటుందని తాము గతంలోనే దీనిపై టిక్ టాక్ యజమాన్యాయానికి లేఖ రాశామని, కానీ తమకు తగినట్లు మార్పులు చేయడంలో టిక్ టాక్ యాజమాన్యం విఫలమైందని అందుకే నిషేధించినట్లు చెప్పుకొచ్చింది. పాకిస్థాన్ లో అనేకమంది నెటిజన్ల నుంచి కూడా టిక్ టాక్ యాప్ పై అనేక పిర్యాదులు రావడంతో నిషేధించక తప్పని పరిస్థితి నెలకొన్నట్లు పిటిఐ కథనం వెలువడించింది. ఇప్పుడు తమకు మిత్ర దేశమైన పాకిస్థాన్ కూడా టిక్ టాక్ ను నిషేధించడంతో చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

పాపం రాఘవేంద్రరావు చివరకు అలా సెట్ చేస్తున్నాడు

టీడీపీకి నాణ్యతలో ఎక్కడ లోపం కనిపించినట్లు లేదు, అందుకే మరొక రూటులో

నాకు యూటర్న్ రాజకీయాలు తెలియవని తేల్చి చెప్పిన సీఎం జగన్