బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పంగా’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అశ్విని అయ్యర్‌ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ మాజీ మహిళా కబడ్డీ ఛాంపియన్ గా నటించింది. ఇది మహిళా కబడ్డీ క్రీడాకారిణి జయ నిగమ్ బయోపిక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

పెళ్ళికి ముందు ఓ యువతీ ఎలా ఉన్న పెళ్లి తరువాత ఆమె బరువు బాధ్యతలను భుజానికి ఎత్తుకోకతప్పదు. ఇక ఇందులో జయ నిగమ్ బ్యాంకు ఉద్యోగి. ఇక పెళ్ళికి ముందు జాతీయ అవార్డు అందుకుని అందరి చేత ప్రశంసలు పొందిన జయ నిగమ్.. పెళ్లి తర్వాత కనీస గుర్తింపుకు కూడా నోచుకోదు. దీంతో ఆమె ద్రుష్టి మళ్ళీ కబడ్డీ అటుపై పడుతుంది. ఇండియా తరుపున అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ గెలవాలని కళలు కంటుంది. ఆమె కళలు నెరవేరాయా? లేదా? అనేదే ఈ సినిమా.

ఇక ఈ సినిమాలో కంగనా రనౌత్ చాలా చక్కగా నటించారు. అద్భుతమైన కథకు ఎలాంటి కల్పితాలు జోడించకుండా ఈ సినిమాని అశ్విని అయ్యర్‌ చాలా చక్కగా తెరకెక్కించారు. కథ ఆద్యంతం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులను మైమరిపింపచేస్తుంది. ఇక మధ్యతరగతి బంధాలను, జీవితాలను తెరపై చక్కగా చూపించారు. జయ నిగమ్ తన జీవితంలో మరోసారి కబడ్డీ వైపు అడుగులు వేసే కీలక సన్నివేశాలను బాగా చూపించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసును హత్తుకోవడం కాయంగా కనిపిస్తుంది. అందరూ చూడవలసిన సినిమా ఇదని.. మరి ముఖ్యంగా మహిళలు ఈ సినిమా మిస్ అవ్వకూడదు అంటున్నారు సినీ విశ్లేషకులు.

  •  
  •  
  •  
  •  
  •  
  •