పాణ్యం నియోజకవర్గానికి చెందిన ఏరాసు ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను ఇబ్బందికి గురిచేస్తున్నాడని నియోజకర్గానికి చెందిన తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి వైసిపి పార్టీకి అండగా ఉండటంతో పాటు, టీడీపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని, ఏరాసుని ఇంచార్జ్ బాధ్యతల నుంచి తొలగించి మంచి నాయకుడిని నియమించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుతున్నారు.

ఏరాసు ప్రతాప్ రెడ్డి నీరు చెట్టుకి సంబంధించిన పనులు కూడా వైసిపి నాయకులకు అప్పగిస్తూ తెలుగుదేశం నాయకులకు అన్యాయం చేస్తున్నారని ముఖ్యమంత్రిని కలవడంతో నియోజకవర్గంలో రాబోయే రోజులలో ఏరాసు వైసిపి పార్టీలో చేరుతాడా అన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు పాణ్యం నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు స్పందించడం లేదు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోతుందని…. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ పార్టీ నాయకులతో టచ్ లోకి వస్తున్న సంగతి తెలుస్తూనే, ఇందులో భాగంగానే ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీ పార్టీ నాయకులతో టచ్ లో ఉంటూ తెలుగుదేశం నాయకులకు అన్యాయం చేస్తున్నట్లు తెలుస్తుంది.