లాక్ డౌన్ సమయంలో ఆర్జీవీ 20 నిమిషాల సినిమాలు తీసి ఏటిటి పేరుతో విడుదల చేసి కోట్ల రూపాయలను పోగేసుకున్నాడు. అతడు తీసిన సినిమాలు ఎంత నాసిరకంగా ఉన్నాయో చూసిన ప్రతిఒక్కరు తమ డబ్బులకు సరైన న్యాయం జరగలేదని, ఆర్జీవీ మోసం చేసాడని తిట్టుకున్నవారే. అతడు తన సినిమాను మెగా కుటుంబంపై తీసి సొమ్ము చేసుకోవడం గతం నుంచే అతడికి పరిపాటిగా మారింది. ఇప్పుడు అతడిని ఎవరు పట్టించుకోవడం లేదని బాధపడిపోయినట్లున్నాడు అందుకే మరోసారి “ఆర్జీవీ మిస్సింగ్” పేరుతో మరోసారి మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నాడు.

ఆర్జీవీ సినిమా వస్తుందంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచేది. అతడు పెట్టె పోస్టులకు రెస్పాన్స్ కూడా అదే విధముగా ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్న ‘ఆర్జీవీ మిస్సింగ్” సినిమాను మెగా ఫాన్స్ కూడా లైట్ తీసుకోవడంతో ఆ సినిమాను ఎంతలా ప్రమోట్ చేయాలని అనుకున్నా అర్జీవికి బూస్టింగ్ మాత్రం రావడం లేదు. గతంలో ఆర్జీవీ మెగా కుటుంబంపై సినిమా తీస్తుంటే మెగా అభిమానుల గొడవ గట్రాలతో ఫ్రీ పబ్లిసిటీ రావడంతో ఆర్జీవీ మంచిగా డబ్బులు సంపాదించేవాడు. కానీ మెగా అభిమానుల అర్జీవిని పట్టించుకోకపోవడంతో పాపం ఆర్జీవీ పరిస్థితి ఇప్పుడు అటుఇటు కాకుండా అంది. ఇక ఆర్జీవీ తీసే సినిమాలకు కూడా టికెట్స్ తెగే పరిస్థితైతే కష్టమే. లాక్ డౌన్స్ సమయంలో డబ్బులు పెట్టి కొని జేబులకు చిల్లు వేయించుకున్న వారు అతడిని జీవితంలో మర్చిపోయే పరిస్థితి లేదు. ఒకవైపున సెమి న్యూడ్ పేరుతో, మెగా కుటుంబంపై ఆక్రోశంతో కంటెంట్ లేని దిక్కుమాలిన సినిమాలను తీసి దారుణంగా హింసించాడు.