చంద్రబాబు నాయుడు నిన్న అనంతపురం జిల్లాలో పర్యటనలో కీలకంగా ధర్మవరం నియోజకవర్గంపై భేటీ జరిగినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరి పార్టీ మారడంతో పాటు పార్టీ పగ్గాలు ఎవరకి అప్పగించాలన్న చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి పరిటాల కుటుంబాన్ని ఆహ్వానించి ధర్మవరం నియోజకవర్గం బాధ్యతలు తీసుకోవాలని, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న మీరైతేనే ధర్మవరం నియోజకవర్గంలో పార్టీని పటిష్ట పరచగలరని బాబు తన మనసులోని మాట వ్యక్తం చేశారట.

ఇక భేటీ సందర్భంగా పరిటాల సునీత తమను వరదాపురం సూరి ధర్మవరం నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకుండా గత ఐదు సంవత్సరాలు అడ్డుకున్నాడని… కానీ  తాము పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నామని.. ఇప్పుడునా లాంటి వ్యక్తి పార్టీ నుంచి పోవడంతో కార్యకర్తలకు భరోసా కల్పించ వలసిన అవసరం ఉందని.. తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామని పరిటాల సునీత అన్నారట.

గత ఎన్నికలలో పరిటాల శ్రీరామ్ కోసం ధర్మవరం నియోజకవర్గం కేటాయించాలని పరిటాల సునీత చంద్రబాబు దగ్గర గట్టి ప్రయత్నాలే చేసారు. కానీ స్థానిక ఎమ్మెల్యే వరదాపురం సూరి ఆర్ధికంగా బలవంతుడు కావడంతో తనను తప్పించి పరిటాల కుటుంబానికి అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఇక అనంతపురం నేతలలో వరదాపురం సూరి సంపాదన గత ఐదు సంవత్సరాలలో వందల కోట్ల రూపాయలకు చేరిందని… ఆ డబ్బుని కాపాడుకోవడానికి స్వార్ధంతో బీజేపీ పంచన చేరాడని పరిటాల కుటుంబంతో మరోసారి ధర్మవరం నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకుంటామని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.