‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్.. వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో కొంత షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఈ సినిమా లాక్ డౌన్ కు ముందే వారం రోజుల షూటింగ్ జరుపుకుంది. ఇక ఈ సినిమాలతో పాటు మైత్రి మూవీస్ -హరీష్ శంకర్ సినిమా, రామ్ తాళ్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి సినిమా ఒప్పుకున్నాడు. ఇక వీటితో పాటు ‘అయ్యప్పన్ కోషియమ్’ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు కూడా సమాచారం ఉంది.

ఇక ఇప్పుడు ఈ సినిమాలన్నింటితో పాటు బండ్ల గణేష్ నిర్మాతగా మరో సినిమా ఒప్పుకున్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని బండ్ల గణేషే స్వయంగా ఒప్పుకున్నాడు. మా బాస్ ఒకే అన్నారు. మరోసారి నా కళలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదములు అంటూ ట్విట్టర్లో పవన్ తో దిగిన ఫోటోను షేర్ చేసాడు.

bandla ganesh twittar

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు..!

గుడ్ న్యూస్.. రష్యా వ్యాక్సిన్ విజయవంతం.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు..!

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. గొడవపడ్డ నోయెల్, లాస్య..!