జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలను ముగించుకొని ఈరోజు హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తరువాత నేరుగా తాడేపల్లి వెళ్లి జనసేన పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. ఇక నుంచి విజయవాడ వేదికగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అనుకుంటున్నారట.

ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వ్యతిరేకిస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరోసారి ముందుకు తీసుకొని వెళ్లాలని బావిస్తున్నారట. ఇక త్వరలో జరగబోయే మునిసిపల్, పంచాయితీ ఎన్నికలలో సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని… అలా జరగాలంటే ప్రత్యేక హోదా ఉద్యమంతో ప్రజలలో చైతన్యం కలిగిస్తే పార్టీకి పునరుత్తేజం అదే వస్తుందని అంచనా వేస్తున్నారట. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని, వచ్చే ఎన్నికలలో ఏపార్టీతో కలసి వెళ్ళాలి అనేది… త్వరలోనే నిర్ణయించి దానికి తగట్లు కార్యకర్తలను ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •