నిన్న విజయవాడ ఫార్చ్యూన్ మురళి హోటల్ వేదికగా జనసేన పార్టీతో బీజేపీ పార్టీ పొత్తు కుదిరింది. ఈ పొత్తుల్లో భాగంగా వచ్చే లోకల్ బాడీ ఎన్నికలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడంతో పాటు ఇలా అన్నింటా కలసి మెలసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇలా జనసేన పార్టీతో భేటీ ముగిసిందో లేదో అప్పుడే పవన్ కళ్యాణ్ తెలంగాణాలో బీజేపీ పార్టీ కోసం ప్రచారం చేయబోతున్నాడని ఉహాగానాలు వ్యాపించాయి.

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజెప్పఁర్తి బారి కసరత్తే చేస్తుంది. అందులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేత సుడిగాలి పర్యటన చేయించి తెలంగాణాలో బీజేపీ సత్తా చాటాలని చూస్తుంది. రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ ను బీజేపీ గట్టిగానే వాడేలా కనపడుతుంది. ఇక ఇప్పటికే వీరిద్దరూ పొత్తులకు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలు పవన్ కళ్యాణ్ పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇక నుంచి చేగువేరా అభిమాని కాదని “చెంగువేరా” అభిమాని అని ఇలా పవన్ కళ్యాణ్ నమ్మకద్రోహం చేస్తాడని అనుకోలేదని వారు వ్యాఖ్యలు చేశారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •