తానా వేడుకలు అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది తెలుగు వారందరు కలసి అమెరికాలో చేసుకునే పండుగ. ఇది ఇప్పటి మాట కాదు, తానా పెట్టిన మొదట్లో ఈ నానుడి ఉండేది, తరువాత తరువాత తానా సభలను ఒక కులానికి చెందిన వారు మాత్రమే ముందుండి నడిపించడంతో కుల ముద్ర తానా సభల మీద గట్టిగా పడటంతో వేరే కులపోల్లు కూడా సంఘాలు ఏర్పాటు చేసుకొని వారికి తోచిన రీతిలో వారు వేడుకలు చేసుకుంటున్నారు. తానా సభలకు వెళ్లే ముఖ్యమైన అతిధులు కూడా ఆ కులానికి చెందిన వారు మాత్రమే ఉంటారు.

కానీ ఈసారి తానా వేడుకలకు కొత్తగా, సరి కొత్తగా కాపు కులానికి చెందిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించడంతో కొంత ఆశ్చర్యం,తో పాటు, తానాలో ఏమి జరుగుతుందో తెలియక కొంత అయ్యోమయ్యనికి గురయ్యారు. కానీ ఇదంతా కావాలనే చేసారని, తెలుగుదేశం పార్టీ గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోవడంతో తానా, తందానా అంటూ అమెరికాకు వెళ్లి వేడుకలలో పాల్గొనే అంత ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ నేతలు లేరు. ఒకవేళ ఈ ఎన్నికలలో చంద్రబాబు గెలిచి ఉంటే తానా సభలకు ముఖ్య అతిధిగా చంద్రబాబు నాయుడే వెళ్ళేవాడు. కానీ మొహం చూపించుకోలేని పరిస్థితులలో ఉండటంతో సైలెంట్ గా ఉండిపోయారు.

కానీ తానా వేడుకలకు ముఖ్య అతిధులు ఎవరు రాకపోతే టికెట్స్ తెగవు. అందులోనూ బోలెడు ఖర్చుతో కూడుకున్న పని. “తానాకు” నష్టం వాటిల్లితే దానిని భరించే శక్తీ కూడా ఎవరు తమ మీద వేసుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే చంద్రబాబు నాయుడు పార్టనర్ గా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ ను కనుక తానా సభలకు ఆహ్వానిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ను దగ్గర నుంచి చూసి నాలుగు ఫోటోలు దిగవచ్చన్న కోరికతో తానా సభకు టికెట్స్ కొంటారన్న వారి ముందు చూపు ఆలోచనతో పుట్టిందే పవన్ కళ్యాణ్ కు తానా ఆహ్వానం.

కానీ పవన్ కళ్యాణ్ కూడా ఈ సభల పట్ల అంత ఆసక్తి కనపరచలేదని వినికిడి. కారణం పవన్ కళ్యాణ్ తాను నిలబడి స్వయంగా పోటీ చేసిన భీమవరం, గాజువాక స్థానాలలో దారుణంగా ఓడిపోవడంతో కొంత ఇబ్బంది కరంగా ఫీల్ అయ్యాడు. కానీ తెలుగుదేశం పార్టీలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టే పెద్దలు పవన్ కళ్యాణ్ తో మంతనాలు చేసి తానా సభలకు హాజరయ్యేలా చేస్తున్నారు. ఇక వారితో పాటు అదే కులానికి చెందిన ఒక మీడియా అధినేత కూడా పవన్ కళ్యాణ్ ను తానా సభలకు వచ్చేలా ఒప్పించి దగ్గరుండి తీసుకొని వెళ్తున్నాడు. ఈ మీడియా అధినేతతో పవన్ కళ్యాణ్ కు ముందు నుంచే మంచి సఖ్యత ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ కు ఖరీదైన కారు కూడా బహుమానం చేసాడని ఫిలిం సర్కిల్ లో గుసగుసలు వినపడ్డాయి. చంద్రబాబు రాకపోతే ఎక్కడ తానా వేడుకలు ప్లాప్ అవుతాయో అని కంగారు పడ్డ తానా సబ్యులకు పవన్ కళ్యాణ్ కారణంగా విజయవంతం ముగించవచ్చను ఆనందం వ్యక్తం చేస్తున్నారట.
  •  
  •  
  •  
  •  
  •  
  •