నిన్న పవన్ కళ్యాణ్ తో విజయవాడలో బీజేపీ నేతల భేటీ తరువాత బీజేపీ – జనసేన రెండు పార్టీలు కలసి రాబోయే రోజులలో మునుకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పాటు రాబోయే రోజులలో బలీయమైన శక్తిగా బీజేపీ పార్టీ ఏపీలో ఎదగాలని చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా జనసేన పార్టీతో కలసి తన అడుగులను వేయబోతుంది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో రెండు పార్టీలు కలసి పోటీ చేయాలనీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది.

పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ పార్టీల భేటీతో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ రాబోయే 2024లో పవన్ కళ్యాణ్ సీఎం సీటును అధిరోహిస్తాడని తన ట్విట్టర్ అకౌంట్ లో చెప్పుకోచ్చాడు. ఇప్పటికే జనసేన సైనికులు చాల మంది బీజేపీతో కలసి జనసేన పార్టీ నడవడంపై ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉండటంతో తమకు లాభించే అవకాశంఉందని లెక్కలేసుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •